గాత్రం:బాలు
పల్లవి:
గోవింద నిశ్చలాలంద మందార మకరంద
నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కీర్తన
మధురాతి మధురం
ఏమొకొ ఏమొకొ
చిగురుటధరమున ఎడ నెడ కస్తురి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
ఏమొకొ ఏమొకొ
చిగురుటధరమున ఎడ నెడ కస్తురి నిండెను
చరణం1:
కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడి దేమ్మొ చింతింపరే చెలులు
నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు
నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు
నిలువున పెరుకగ నంటిన నెత్తురు కాదు కదా
ఏమొకొ ఏమొకొ
చిగురుటధరమున ఎడ నెడ కస్తురి నిండెను ఆ ఆ
చరణం2:
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
తరిక జం జం జం జం జం జం కిటతకకితుం
మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే రతివలు జాజర
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర
బారపు కుచములపైపై కడుసింగారం నెరపెడి గంద వొడి
చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర
బింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు సంకుమదమ్ముల జాజర
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర జగడపు చనవుల జాజర
జగడపు చనవుల జాజర
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్కడ వినండి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment