Nov 25, 2008

చిన్నారి స్నేహం

గాత్రం:బాలు




జన్మకారణ పాపం జంతువైపోతుంటే
కాలమే తన శీలం కాటిలో తగలేస్తే
కలగన్న తీపి కోరికే కన్నీరై రగులుతుంటే
గత జీవితాల జ్ఞాపకం తన గమ్యం మరిచిపోతే
ప్రేమే త్యాగమౌతున్నా త్యాగం శోకమౌతున్నా
బ్రతుకే చితికిపోతునా బలిగా నిన్ను చేస్తున్నా
గాలిలోని దీపమల్లే జాలిగానే పాడుకో
చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కథగానే రాసుకో
మనసైతే మళ్ళి చదువుకో మరుజన్మకైనా కలుసుకో
ఏనాటికేమౌతున్నా ఏగూడు నీదౌతున్నా హాయిగానె ఆడుకో
చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కథగానే రాసుకో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: