Dec 12, 2008

పెళ్ళిచేసిచూడు(1954)

తారాగణం:రామారావు,సావిత్రి,ఎస్.వరలక్ష్మి
గాత్రం:ఘంటసాల
సంగీతం: ఘంటసాల
సాహిత్యం:పింగళి



పల్లవి:

ఓ భావి భారత భాగ్య విధాతలార యువతి యువకులారా ఆ ఆ
స్వానుభవమున చాటు నా సందేశమిదే వారేవా
పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాపురముండాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలోయ్

చరణం1:

కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి
కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా
పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖ పడగా
ఇంట బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్ తరంపం
ఇంట బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్

పెళ్ళి చేసుకొని పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాపురముండాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలోయ్

చరణం2:

నవ భావముల నవ రాగముల ఆ ఆ ఆ
నవ జీవనమె నడపాలోయ్
నవ భావముల నవ రాగముల నవ జీవనమె నడపాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్

పెళ్ళి చేసుకొని పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాపురముండాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలోయ్
హాయిగా ఉండాలోయ్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: