సాహిత్యం:సిరివెన్నెల
పల్లవి:
వెయ్యిన్నొక్క జిల్లాలవరకు వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏ మూలవిన్నా నీ అందాల సంకీర్తనే
హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడలయ్యావొ ఏమో వయ్యారీ

చరణం1:
ఖర్మ కాలి రావణుండు నిన్ను చూడలేదుగాని
సీత ఊసునే తలచునా పొరపడి
భీష్ముడున్న కాలమందు నువ్వు పుట్టలేదుగాని
బ్రహ్మచారిగా బ్రతుకునా పొరపడి
ఇంత గొప్ప అందగత్తె ముందుగానె పుట్టివుంటే
పాత యుద్ద గాథలన్నీ మారి ఉండేవే
ఇంత గొప్ప అందగత్తె ముందుగానె పుట్టివుంటే
పాత యుద్ద గాథలన్నీ మారి వుండేవే
పొరపాటు బ్రహ్మదిగాని సరి లేనిదీ అలివేణి
వెయ్యిన్నొక్క జిల్లాలవరకు వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏ మూలవిన్నా నీ అందాల సంకీర్తనే
హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడలయ్యావొ ఏమో వయ్యారీ
వెయ్యిన్నొక్క జిల్లాలవరకు వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏ మూలవిన్నా నీ అందాల సంకీర్తనే
చరణం2:
అల్లసాని వారిదంత అవక తవక టేష్టు గనక
వెళ్ళి పోయెనె చల్లగా ప్రవరుడు అయ్యయ్యో
వరూధినిని కాక నిన్నే వలేసుంటె కళ్ళు చెదిరి
విడిచిపెట్టునా భామినీ బ్రాహ్మడు
ఒక్క సారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేరు ఎవరూ
కాపురాలు గంగకొదిలి వెంట పడతారే

ముసలాడి ముడతలకైనా కసి రేపగలదీ కూన
వెయ్యిన్నొక్క జిల్లాలవరకు వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏ మూలవిన్నా నీ అందాల సంకీర్తనే
హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడలయ్యావొ ఏమో వయ్యారీ
వెయ్యిన్నొక్క జిల్లాలవరకు వింటున్నాము నీ కీర్తినే
|
No comments:
Post a Comment