సంగీతం:అద్దేపల్లి రామారావు
సాహిత్యం:బాలంత్రపు రజనికాంతరావు
గాత్రం:మధవపెద్ది సత్యం
దర్శకత్వం:బి.ఎన్.రెడ్డి
విడుదల:1954
పల్లవి:
లలలల ఆయీ
ఆయి ఆయి ఆయీ ఆపదలు గాయి
ఆ తాధిమి తకధిమి తోల్ బొమ్మ, దీని తమాష చూడవె కీల్ బొమ్మ
తాధిమి తకధిమి తోల్ బొమ్మ, దీని తమాష చూడవె కీల్ బొమ్మ
దీని తమాష హ హ హ హ దీని తమాష చూడవె మాయబొమ్మ
ఆటమ్మా,పాటమ్మా,జగమంతా బొమ్మాలాటమ్మ
ఆటమ్మా,పాటమ్మా,జగమంతా బొమ్మాలాటమ్మ
తళాంగు తకధిమి తోల్ బొమ్మ,తోం తకతై తకతై హహహ
తోం తకతై తకతై మాయబొమ్మ
లలలల ఆయీ
ఆయి ఆయి ఆయీ ఆపదలు గాయి,ఆపదలు గాయి
చరణం1:
హుహుహు తకతై తకతై మాయబొమ్మ హు
నాలుగు దిక్కుల నడిమి సంతలో తూగే తుళ్ళే తోల్ బొమ్మ, తూగే తుళ్ళే తోల్ బొమ్మ
ఎవరికెవ్వరు ఏమౌతారో వివరం తెలుసా కీల్ బొమ్మ
ఈ వివరం తెలుసా మాయబొమ్మ
తలాంగు తకధిమి తోల్ బొమ్మ,తోం తకతై తకతై మాయబొమ్మ
కోపం తాపం క్రూరకర్మలు కూడని పనులే తోల్ బొమ్మా కూడని పనులే కీల్ బొమ్మ
పాపపు రొంపిని పడబోతె పరమాత్ముని నమ్మవె కీల్ బొమ్మ
పాపపు రొంపిని పడబోతె పరమాత్ముని నమ్మవె కీల్ బొమ్మ
ఆటమ్మ,పాటమ్మ,పరమాత్ముని బొమ్మాలాటమ్మ
ఆటమ్మ,పాటమ్మ హు
|
No comments:
Post a Comment