Dec 9, 2008

చూడాలనివుంది

తారాగణం: చిరంజీవి,సౌందర్య ,అంజలా జవేరి
గాత్రం: హరిహరన్
సాహిత్యం: వేటూరి
సంగీతం: మణి శర్మ
దర్శకత్వం: గుణశేఖర్
సంస్థ: వైజయంతి మూవీస్
నిర్మాత:అశ్వనీదత్
విడుదల:1998





పల్లవి:

సరిమమగరి ససనిదపస
సరిమమగరి ససనిదపస
రిమగనిమప స సనిదపమగమగరి
యమహానగరి కలకత్తా పురి
యమహానగరి కలకత్తా పురి
నమహొ హుగిలి హౌరా వారధీ
యమహానగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి
నమహొ హుగిలి హౌరా వారధీ

చరణం:1

నేతాజి పుట్టినచోట గీతాంజలి పూసినచోట పాడనా తెలుగులో
ఆ హంస పాడిన పాటే ఆ నందుడు చూపిన బాట సాగనా
పదుగురు పరుగు తీసింది పట్నం
బ్రతుకుతో వెయ్యి బంధం కడకు చేరాలి గమ్యం కదలి పోరా
ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజీ బిజీ బ్రతుకుల
గజి బిజి ఉరుకుల పరుగులలో

యమహానగరి కలకత్తా పురి నమహొ హుగిలి హౌరా వారధీ
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి

చరణం2:

బెంగాలి కోకిల బాల తెలుగింటి కోడలుపిల్ల మాలిని సరోజిని
రోజంతా సూర్యుడు కింద రాత్రంతా రజనీ కింద సాగనీ
పదుగురు ప్రేమలేలేని లోకం దేవతామార్కు మైకం
శరన్నావలాభిషేకం తెలుసుకోరా కధలకు నెలవట కళలకు కొలువట
తిధులకు సెలవట అధిదుల గొడవట
కలకట నగరకు కిటకిటలో

యమహానగరి కలకత్తా పురి నమహొ హుగిలి హౌరా వారధీ
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి

చరణం3:

వందేమాతరమే అన్న వంగా భూతలమే మిన్న జాతికే కీర్తిరా
మాతంగి కాళీ నిలయ చోరంగి రంగులదునియ నీదిరా
వినుగురు సత్యజిత్‌రే సితార, యస్ డి బర్మన్‌ గిటారా
ధెరీసాకి కుమారా కదలిరారా
జనగణమనముల స్వరపద వనముల
హృదయపు లయలను శృతి పరిచిన ప్రియ సుఖపిక ముఖ సుఖ రవళులతో

యమహానగరి కలకత్తా పురి నమహొ హుగిలి హౌరా వారధీ
యమహానగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి నమహొ హుగిలి హౌరా వారధీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: