Dec 25, 2008

మేరిమాత

తారాగణం : జయలలిత, కే.ఆర్.విజయ,జెమిని గణేషన్, శ్రీవిద్య
గాత్రం:యేసుదాసు
సాహిత్యం : రాజశ్రీ
సంగీత దర్శకుడు: జి. దేవరాజ్
దర్శకత్వం: తంగప్పన్
సంస్థ : శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్
విడుదల:1971

పల్లవి:

సాగరతీర సమీపాన తరగని కావ్య సుధామధురం
కాలచరిత్రకు సంకేతం కరుణకు చెరగని ప్రతిరూపం
సాగరతీర సమీపాన తరగని కావ్య సుధామధురం
కాలచరిత్రకు సంకేతం కరుణకు చెరగని ప్రతిరూపం

చరణం1:

పచ్చని వృక్షములలరారు బంగరు పైరులు కనరారు
పచ్చని వృక్షములలరారు బంగరు పైరులు కనరారు
మాయని సిరులే సమకూరు వేలాంగణ్ణి అను ఊరు
సాగరతీర సమీపాన తరగని కావ్య సుధామధురం
కాలచరిత్రకు సంకేతం కరుణకు చెరగని ప్రతిరూపం

చరణం2:

విరితావులను వెదజల్లి వీచే చల్లని చిరుగాలి
విరితావులను వెదజల్లి వీచే చల్లని చిరుగాలి
ఆవుదూడల ప్రేమగని పాడెను మమతల చిన్నవని
సాగరతీర సమీపాన తరగని కావ్య సుధామధురం
కాలచరిత్రకు సంకేతం కరుణకు చెరగని ప్రతిరూపం

చరణం3:

మట్టిని నమ్మిన కర్షకులు మాణిక్యాలు పొందేరు
మట్టిని నమ్మిన కర్షకులు మాణిక్యాలు పొందేరు
కడలిని నమ్మిన జాలరులు ఘన ఫలితాలు చెందేరు
కడలిని నమ్మిన జాలరులు ఘన ఫలితాలు చెందేరు
సాగరతీర సమీపాన తరగని కావ్య సుధామధురం
కాలచరిత్రకు సంకేతం కరుణకు చెరగని ప్రతిరూపం

చరణం4:

పాలుతేనై కలిసారు అనురాగములో దంపతులు
పాలుతేనై కలిసారు అనురాగములో దంపతులు
తోడునీడై మెలిగారు చవిచూసారు స్వర్గాలు
సాగరతీర సమీపాన తరగని కావ్య సుధామధురం
కాలచరిత్రకు సంకేతం కరుణకు చెరగని ప్రతిరూపం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: