Dec 27, 2008

మామగారు

తారాగణం:వినోద్ కుమార్,యమున,ఐశ్వర్య,దాసరి నారాయణరావు,కోట శ్రీనివాసరావు,బాబుమోహన్
గాత్రం:బాలు,చిత్ర
దర్శకత్వం:ముత్యాల సుబ్బయ్య
విడుదల:1991

పల్లవి:

శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ మచ్చలేనొడే
ఏ మచ్చలేని జాబిల్లిమల్లే ఎన్నెల్లు చల్లాడే
నింగి ఒంగింది నేల పొంగింది ఊహ ఊగింది ఉయ్యాలో
పేదరాగంలో మారుమ్రోగింది పెళ్ళిసన్నాయి అమ్మమ్మో
శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ మచ్చలేనొడే

చరణం1:

ఉరుపేరులేని నన్ను గుండెల్లో దాచుకున్నావే
ఏరికోరి నిన్నే ఎరువాకల్లే చేరుకున్నానే
తానుగా మెచ్చెనే తావిలేని పువ్వుని
పూలకే తావిలే చిన్ని నీ నవ్వే
ఏజన్మలోనో ఏనాడు నీకోసమే పుట్టానో
పుణ్యాలుపండే ఈనాడు ఈదేవుడే నావాడు
ఏనాడు నీవు నాజోడు నేను నీతోనే అమ్మమ్మో

చరణం2:

తోడు నీడలోనే ముద్దుముచ్చట్లు ఇంక వింటాలే
ఎన్ని జన్మలైనా వీడిపోలేని బంధమింతేలే
పల్లవి నీవని కోయిలమ్మ పాటలో
నిత్యము ఆమనే నిండు నీ ఒడిలో
మావాడకొచ్చి మావాడై మా మంచినే కోరావే
చుక్కల్లే నీవే నాతోడై నా పక్కనే చేరావే
చక్కని చుక్క నీవేలే వేల చుక్కల్లో అమ్మమ్మో

శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ మచ్చలేనొడే
ఏ మచ్చలేని జాబిల్లిమల్లే ఎన్నెల్లు చల్లాడే
నింగి ఒంగింది నేల పొంగింది ఊహ ఊగింది ఉయ్యాలో
పేదరాగంలో మారుమ్రోగింది పెళ్ళిసన్నాయి అమ్మమ్మో

||

No comments: