గాత్రం:బాలు
పల్లవి:
ఏలాద్రి ఎంకన్న ఏడ దాగినావన్న సంక్రాంతి వేడుకొచ్చిందో
మా పల్లె ఈడుకొచ్చిందో
ఓరబ్బడి సుబ్బాయమ్మ నీ మొగుడు సిపాయమ్మ
ఆడెక్కడికెళ్ళాడమ్మ ఏ చుక్కని పట్టాడమ్మ
ఏలాద్రి ఎంకన్న ఏడ దాగినావన్న సంక్రాంతి వేడుకొచ్చిందో
మా పల్లె ఈడుకొచ్చిందో
సంకురాతిరొస్తానని సంకబిడ్డనిస్తానని టపాలో ఉత్తరమేసాడా ఆ ఆ
ఏలాద్రి ఎంకన్న ఏడ దాగినావన్న సంక్రాంతి వేడుకొచ్చిందో
మా పల్లె ఈడుకొచ్చిందో హొయ్ హొయ్ హొయ్
చరణం1:
మందారపువ్వెడితే మంచి మొగుడొస్తాడని మంచమెక్కి వుంటాడని మంచానె పడివుంటాడని
చామంతి పువ్వు పెడితే చిట్టిమొగుడొస్తాడని చుట్టుగాజులిస్తాడని గట్టిగ చుట్టుకువుంటాడని
కోలాటమాడిందె బుల్‌బుల్‌పిట్ట గోరంచు పైటచెంగు జారేనెట్ట
కోలాటమాడిందె బుల్‌బుల్‌పిట్ట గోరంచు పైటచెంగు జారేనెట్ట
జారుడుచెంగుల జింతానో జాతరతొక్కుడు ఉయ్యాలో
ముడుపుకట్టి ముద్దులాడె పండగ
ఏలాద్రి ఎంకన్న ఏడ దాగినావన్న సంక్రాంతి వేడుకొచ్చిందో
మా పల్లె ఈడుకొచ్చిందో హొయ్ హొయ్ హొయ్
చరణం2:
ఓలమ్మ చక్కని చుక్క నీసోకు మంచమెక్క ఇస్తాను చెరుకుముక్క.. ఇస్తాడమ్మ చెరుకుముక్క
ఆకువక్క చెరుకుముక్క నింగినిప్పి వలపుచుక్క కలిపేసి చూడు లెక్క..వడ్డీమీద వడ్డీ లెక్క
వడ్డీలు గుంజేది నీకొసమే వడ్డణమేట్టాలని
వడ్డీలు గుంజేది నీకొసమే వడ్డణమేట్టాలని
అల్లరిచిల్లరి ఆలుచిప్ప చక్కని చుక్కల కొబ్బరిముక్క లగ్గాలెట్టి పగ్గంపట్టి ఆడిస్తా
ఏలాద్రి ఎంకన్న ఏడ దాగినావన్న సంక్రాంతి వేడుకొచ్చిందో
మా పల్లె ఈడుకొచ్చిందో హొయ్ హొయ్ హొయ్
చరణం3:
అల్లుళ్ళ పండగని అత్తింటి ఆశలని గుత్తంగా పెడుతుంటే గుచ్చిగుచ్చి పెడుతుంటే
ఒళ్ళంత పొగరుపడె ఇళ్ళంత గుల్లబడె అత్తేమో దిగులుపడె..అత్తామావా దిగులుపడె
శనిగ్రహం పడితే ఏడేళ్ళంట అల్లుళ్ళ గ్రహ పడితే అంతేనంట
శనిగ్రహం పడితే ఏడేళ్ళంట అల్లుళ్ళ గ్రహ పడితే అంతేనంట
బావలు బావలు పన్నీరు బావను పట్టుకు తన్నేరు
వీసెడు గంధం వీపుకురాసి గుడ్డేరు
ఏలాద్రి ఎంకన్న ఏడ దాగినావన్న సంక్రాంతి వేడుకొచ్చిందో
మా పల్లె ఈడుకొచ్చిందో హొయ్ హొయ్ హొయ్
ఓరబ్బడి సుబ్బాయమ్మ నీ మొగుడు సిపాయమ్మ
ఆడెక్కడికెళ్ళాడమ్మ ఏ చుక్కని పట్టాడమ్మ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment