Jan 19, 2009

ప్రజారాజ్యం పార్టి థీం సాంగ్

ప్రజారాజ్యం పార్టి థీం సాంగ్ అభిమానులకోసం

సాహిత్యం:అనంత శ్రీరాం




జయ జయ జయప్రదం
శుభ శుభ శుభప్రదం
ప్రభాత సూర్య ప్రేరితం
అనంత శక్తి పూరితం

దిగత్ దిగత్ దిగత్ దిగత్ దిగత్ దిగంత వ్యాపితం
అనుక్షణం ప్రకాశితం ప్రగాడ తిమిర నాశకం

ప్రవర్ణ అరుణ వాసితం నవీన విప్లవాత్మకం
సువర్ణ హరిత వందితం సుభిక్ష సస్యశ్యామలం

సుసప్త వర్ణ విలితం పవిత్ర శ్వేత శోభితం
ప్రపంచ శాంతి కాంక్షితం ప్రశాంత నయనరంజితం

చతుర్ వింసతి కిరణ సహిత భానుబింబ క్రేంద్రితం
శతసహస్ర మృదుల హృదయ వందితం చవందితం
వినీల గగన వద్యమం అమంద వాయు స్నేహితం
అలాంటి ఓ పతాకమా సలాం సలాం తుజే సలాం

జయ జయ జయప్రదం
శుభ శుభ శుభప్రదం
అహింస తనకి ఆయుధం
స్వరాజయమే మహాశయం

చిరాయువైన నవ్వుతో చివాలు పల్లె పల్లెలో
స్వతంత్రకాంతి నింపిన మహాత్మ గాంధి దీవెన

బడుగు జనుల నుదిటిరాత మార్చినట్టి నేతరా
అంబేద్కరు కలాన ఉన్న రాజనీతి వీవన

కులాలులేని సంఘమే సరైన తన గుండెరా
సమాజ న్యాయ జ్యోతిలోన పూలే సత్య శోధన

విశాల విశ్వమాతగా శృతింపతగిన తల్లిరా
మదర్ థెరిసా చేతిలోన లభించు ప్రేమ లాలన

గ్రహించుకున్న ధవళకాంతి చిందుతున్న అరుణకాంతి
అలాంటి ఓ పతాకమా bless me bless me kindly bless me

జయ జయ జయప్రదం
శుభ శుభ శుభప్రదం
జగాన మానవత్వమే జ్వలింప చేయు అద్భుతం

ప్రజా ప్రయోజనార్ధమై ప్రచండ సింహగర్జనై
డమ డమ నినాదమై ధ్వనించు సమరదుంధుబి

అనాధ జీవ రక్షకై అభాగ్య జనుల నీడకై
అహర్నిశల్ అహర్నిశల్ తపించు వస్త్ర వృక్షమా

సమస్త రైతు శోకమే నశింపజేయు మేఘమా
గంగ పుత్ర హాసమే ఉప్పొంగ చేయు మత్స్యమా

సమాశ్రయించు శ్రామికుల్ పరిశ్రమించు సేవకుల్
అనేక వృత్తి కార్మికుల్ అంగాంగ వికల్ సోదరుల్

మనస్సునందు సంతసం ఫలింపచేయు దైవమా
అలాంటి ఓ పతాకమా ఆదాబ్ ఆదాబ్ ఆదాబ్ బర్సే

మహిళా శక్తితో నవయువ శక్తితో తరగని శక్తితో
ప్రజాభీష్టమగు ప్రజారాజ్యకర ప్రతీక నీవే పతాకమా పతాకమా

నమోనమో నమోనమ నమోనమో నమోనమ
నమోనమో నమోనమ నమోనమో నమోనమ
నమోనమో నమోనమ నమోనమో నమోనమ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: