Feb 16, 2009

చిల్లరదేవుళ్ళు

తారాగణం : ప్రభాకర్‌రెడ్డి,కాంచన
గాత్రం : బాలు
సాహిత్యం : ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
దర్శకత్వం: టి.మాధవరావు
విడుదల: 1975



పల్లవి:

కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం
కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం
దూరమైన కొలదీ పెరుగును అనురాగం
దూరమైన కొలదీ పెరుగును అనురాగం
విరహంలోనే ఉన్నది అనుబంధం
కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం

చరణం1:

నవ్వు నవ్వుకు తేడా ఉంటుంది
నవ్వే అదృష్టం ఎందరికుంటుంది
ఏ కన్నీరైనా వెచ్చగ ఉంటుంది
అది కలిమిలేములను మరిపిస్తుంది
కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం

చరణం2:

వలపు కన్నా తలపే తీయన
కలయిక కన్నా కలలే తీయన
చూపులకన్నా ఎదురు చూపులే తీయన
నేటి కన్నా రేపే తీయన
కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం

చరణం3:

మనసు మనిషిని మనిషిగ చేస్తుంది
వలపా మనసుకు అందాన్నిస్తుంది
ఈ రెండూ లేక జీవితమేముంది
ఆ దేవుడికి మనిషికి తేడా ఏముంది


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: