పల్లవి:
కన్నె కొమ్మన తుమ్మెద రావమ్మా జత కట్టమ్మా
సయ్యాటల ఉయ్యాలల ఆనవాలా
విందీయగ పూదేనియ ఓయిలాలా
కన్నె వన్నెల జాజిగా కోరుకున్నది జాలిగ
ఈరేడగ తారడగ అబ్బురాలా
నాజూకుగ నా దానిగ అమ్మలాల
గుండెల్లోన తొలకరింపు పొంగే జల్లుల్లోన
కొండ కోన పరవశించి తుళ్ళే వెన్నెల్లో
కన్నె కొమ్మన తుమ్మెద రావమ్మా జత కట్టమ్మా
సయ్యాటల ఉయ్యాలల ఆనవాలా
విందీయగ పూదేనియ ఓయిలాలా
చరణం1:
మిలమిల కన్నుల్లో అల పూచే పున్నాగ తేరు హొయ్
చెలి చిరు హృదయంలో ఎల సవ్వడి ముచ్చట తీరు
కోరికల కోన సంబరమాయే చేరుకోవే మైనా
గొరింక వలచి వచ్చి మారాలా
ఊసుల్ని ఉసిగొల్పి జాగేలా
బాల పరువాల సిగ్గు మురిపాల ముద్ద్దాడగనేల
ఎద ఈడేరిన వేళ
కన్నె కొమ్మన తుమ్మెద రావమ్మా జత కట్టమ్మా
సయ్యాటల ఉయ్యాలల ఆనవాలా
విందీయగ పూదేనియ ఓయిలాలా
చరణం2:
గల గల గోదారి సడి సరగాల హొరు
అరమరికలు లేక ఎద విహారాల జోరు హొయ్
పూచినది ప్రాయం తుమ్మెద వాల మనసు కోరి సాయం
పూదాట మాటు చూసి పోదామా
సరసాల జాగారం చేద్దామా
ఈడే విడ్డూరం ఎందుకు మోమాటం
ఎన్నెల్లో జత కూడగ ప్రాయం దరహాసం
కన్నె వన్నెల జాజిగా కోరుకున్నది జాలిగ
ఈరేడగ తారడగ అబ్బురాలా
నాజూకుగ నా దానిగ అమ్మలాల
గుండెలోన తొలకరింపు పొంగే జల్లుల్లోన
కొండ కోన పరవశించి తుళ్ళే వెన్నెల్లో
కన్నె కొమ్మన తుమ్మెద రావమ్మా జత కట్టమ్మమా
సయ్యాటల ఉయ్యాలల ఆనవాలా
విందీయగ పూదేనియ ఓయిలాలా
|
No comments:
Post a Comment