Apr 4, 2009

లవకుశ

గాత్రం: పి.లీల,పి.సుశీల



పల్లవి:

రామ సుగుణధామా రఘువంశజలధిసోమా ఆ ఆ ఆ ఆ
శ్రీరామ సుగుణధామా సీతామనోభిరామా సాకేతసార్వభౌమా
శ్రీరామ సుగుణధామా

చరణం1:

మందస్మిత సుందర వదనారవింద రామా
ఇందీవర శ్యామలాంగ వందితసుత్రామా
మందార మరందోపమ మధురమధురనామా
మందార మరందోపమ మధురమధురనామా
శ్రీరామ సుగుణధామా రఘువంశజలధిసోమా
శ్రీరామ సుగుణధామా

చరణం2:

అవతారపురుష రావణాది దైత్యవిరామా
నవనీత హృదయ ధర్మనిరతరాజలరామా
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా
శ్రీరామ సుగుణధామా రఘువంశజలధిసోమా
సీతామనోభిరామా సాకేతసార్వభౌమా
సీతామనోభిరామా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: