Apr 3, 2009

మీనా

గాత్రం: సుశీల

ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ
శ్రీరామ నామాలు శతకోటి
ఒక్కొక్క పేరు బహుతీపి,బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి

చరణం1:

తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరధరామయ్య స్థవనీయుడు
తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరధరామయ్య స్థవనీయుడు
కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు కళ్యాణరామయ్య కమనీయుడు, కమనీయుడు
శ్రీరామ నామాలు శతకోటి
ఒక్కొక్క పేరు బహుతీపి,బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి

చరణం2:

సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందరరామయ్య సుకుమారుడు
సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందరరామయ్య సుకుమారుడు
కోతిమూకలతో ఆ ఆ ఆ ఆ
కోతిమూకలతో లంకపై దండెత్తు కోదండరామయ్య రణధీరుడు,రణధీరుడు
శ్రీరామ నామాలు శతకోటి
ఒక్కొక్క పేరు బహుతీపి,బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి

చరణం3:

పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు
పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు
అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు అచ్యుతరామయ్య అఖిలాత్ముడు,అఖిలాత్ముడు
శ్రీరామ నామాలు శతకోటి
ఒక్కొక్క పేరు బహుతీపి,బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: