Apr 10, 2009

విప్రనారాయణ

గాత్రం:ఏ.ఎం.రాజా,భానుమతి



పల్లవి:

అనురాగాలు దూరములాయెనా
అనురాగాలు దూరములాయెనా
మన యోగాలు మారిపోయెనా
అనురాగాలు దూరములాయెనా
మన యోగాలు మారిపోయెనా
అనురాగాలు దూరములాయెనా

చరణం1:

నే మనసార చేసిన సేవలకు
ఎడబాటే నాకు దీవెన
ఫలమయ్యేన ఈ ఆవేదన
ఫలమయ్యేన ఈ ఆవేదన
ఫలపూర్తేన ఇక నా సాధన

అనురాగాలు దూరములాయెనా
మన యోగాలు మారిపోయెనా
అనురాగాలు దూరములాయెనా

చరణం2:

ధనమోహమ్మే ఘనమైపోయెనే
మన దేహాలు ఎడమైపొయెనే
మది నీ రూపే కనగా కోరునే
మది నీ రూపే కనగా కోరునే
నిన్ను ఎడబాసి మనగా నేరనే

అనురాగాలు దూరములాయెనే
మన భోగాలు మాసిపోయెనే
అనురాగాలు దూరములాయెనే

చరణం3:

నీ నామమ్ము మరపే రాదురా
నీ ధ్యానమ్ము చెదరిపోదురా
నీ నామమ్ము మరపే రాదురా
నీ ధ్యానమ్ము చెదరిపోదురా
మది కొంతైన శాంతి లేదురా
నిను చేరంగ వలను కాదురా
నా నిమ్మేను మనసు ప్రాణము
నా నిమ్మేను మనసు ప్రాణము
ఏనాడైన స్వామి నీదెరా

అనురాగాలు దూరములాయెనా
మన యోగాలు మారిపోయెనా
అనురాగాలు దూరములాయెనా

చరణం4:

కులము నన్ను అదడు చేసినా
గురులు నన్ను చెదడి వేసినా
కులము నన్ను అదడు చేసినా
గురులు నన్ను చెదడి వేసినా
నా నియమాలు నీరైపోయినా
చెలి నీతోడిదే నా లోకమే
మొరలాలించవే లాలించవే
మొరలాలించవే లాలించవే
దరిజూపించి కడ తేరించవే
దరిచూపించి కడ తేరించవే
దరిచూపించి కడ తేరించవే

||

No comments: