Apr 15, 2009

మల్లె మొగ్గలు

గాత్రం:బాలు,జానకి
సాహిత్యం:వేటూరి



పల్లవి:

మందార మల్లికి శృంగార పూజలు
ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు
మందార మల్లికి శృంగార పూజలు
ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు
నా కళ్ళలో నీ తొలి కాపురాలు
కౌగిళ్ళలో నీ రాణివాసాలు
మనసైన స్వామికి మందార మాలలు
మరుమల్లె వేళకి సిరిమల్లె డోలలు
మనసైన స్వామికి మందార మాలలు
మరుమల్లె వేళకి సిరిమల్లె డోలలు
నా కళ్ళలోతోనే నీరాజనాలు
కౌగిళ్ళతోనే పూలహారాలు

చరణం1:

పుప్పొడి నలుగులు పెట్టనా
పుత్తడి జిలుగులు చూడనా
పుప్పొడి నలుగులు పెట్టనా
పుత్తడి జిలుగులు చూడనా
గంగా యమునా సరస్వతులతో
కృష్ణవేణి నీ జడనల్లనా
వెన్నెల కలువల వెచ్చమరించి
వెన్నెల కలువల వెచ్చమరించి
కిన్నెరవీణలు మీటనా
సస సస
ససరి ససరి
సరిగమ పనిస
సస సస ససరి ససరి సరిగమ పనిస

మనసైన స్వామికి మందార మాలలు
మరుమల్లె వేళకి సిరిమల్లె డోలలు

చరణం2:

పిల్లమగ్రోవిని ఊదనా
పిల్లని గోపిక చేయనా
పిల్లమగ్రోవిని ఊదనా
పిల్లని గోపిక చేయనా
వచ్చీరాని అష్టపదులతో రాసలీలలే ఆడేయనా
కన్నుల వలపు కౌగిలికిచ్చి
కన్నుల వలపు కౌగిలికిచ్చి
వెన్నెల తలుపులు వేయనా
సస సస
ససరి ససరి
సరిగమ పనిస
సస సస ససరి ససరి సరిగమ పనిస

మందార మల్లికి శృంగార పూజలు
ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు
నా కళ్ళలో నీ తొలి కాపురాలు
కౌగిళ్ళలో నీ రాణివాసాలు
మనసైన స్వామికి మందార మాలలు
మరుమల్లె వేళకి సిరిమల్లె డోలలు
నా కళ్ళలోతోనే నీరాజనాలు
కౌగిళ్ళతోనే పూలహారాలు
మందార మల్లికి శృంగార పూజలు
ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: