తారాగణం:నాగార్జున,గౌతమి
గాత్రం:బాలు
సంగీతం:ఇళయరాజా
దర్శకత్వం :ప్రతాప్ పోతన్
విడుదల:1991
పల్లవి:
ఒహొ లైలా ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాల మాపటేల
ఒహొ పిల్ల సుభానల్లా
సరాగంలో విరాగాలా
మిసమిస వయసు రుసరుసల దరువులగుసగుస తెలిసె కలికిచిలక
కసికసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసె కవినిగనక
ఒహొ లైలా ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాల మాపటేల
చరణం1:
విశాఖలో నువ్వు నేను వసంతమే ఆడాలా
హుషారుగా చిన్న పెద్దా షికారులే చెయ్యాలా
వివాహపు పొద్దుల్లోనే వివాదమా ఓ బాల
వరించిన వలపుల్లోనే విరించిలా రాయాలా
అందచందాల అతివల్లోన కోపమే రూపమా
కోపతాపాల మగువల్లోన తప్పనీ తాళమా
చాల్లే బాల నీ ఛాఛచీల సంధ్యారాగలాపన
ఒహొ లైలా ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాల మాపటేల
ఒహొ పిల్ల సుభానల్లా
సరాగంలో విరాగాలా
మిసమిస వయసు రుసరుసల దరువులగుసగుస తెలిసె కలికిచిలక
కసికసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసె కవినిగనక
చరణం2:
జపించిన మంత్రం నీదే తపించిన స్నేహంలో
ప్రపంచము స్వర్గం నీవే స్మరించిన ప్రేమల్లో
ఇది సఖి అంటూ జ్వలించినా ప్రాణంలో
ఇది కథ అన్ని తెలిసి క్షమించవే ప్రాయంతో
కాళ్ళబేరానికొచ్చాకైనా కాకలే తీరవా
గరు మార్చేసి పాహీ అన్నా కేకలే ఆపవా
పోవే బాల చాలించి గోల ప్రేమిస్తున్నా ఘాటుగా
ఒహొ లైలా ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాల మాపటేల
ఒహొ పిల్ల సుభానల్లా
సరాగంలో విరాగాలా
మిసమిస వయసు రుసరుసల దరువులగుసగుస తెలిసె కలికిచిలక
కసికసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసె కవినిగనక
ఒహొ లైలా ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాల మాపటేల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
1 comment:
good song :)
Post a Comment