Apr 19, 2009

పున్నమి నాగు

తారాగణం: చిరంజీవి,నరసింహరాజు,రతి
గాత్రం:బాలు
సాహిత్యం:వేటూరి
సంగీతం: చక్రవర్తి
దర్శకత్వం: యమ్.రాజశేఖర్
నిర్మాతలు:కుమరన్,శరవణన్,బాలసుబ్రహ్మణ్యన్
సంస్థ: ఏ.వి.యమ్ ప్రొడక్షన్స్
విడుదల:1980



పల్లవి:

పున్నమిరాత్రి పువ్వులరాత్రి
వెల్లువ నాలో
పొంగిన వెన్నెల రాత్రి

చరణం1:

మగువ సోకులే మొగలిరేకులై మత్తుగ పిలిచే రాత్రి
మరుడు నరుడిపై మల్లెలు చల్లి రాత్రి మైమరపించే రాత్రి
ఈ వెన్నెలలో ఆ వేదనలో
నాలో వయసుకు నవరాత్రి
కలగా మిగిలే కడరాత్రి
పున్నమిరాత్రి

చరణం2:

కోడెనాగుకై కొదమనాగిని కన్నులు మూసే రాత్రి
కామభిక్షలో కన్నెలందరు మోక్షం పొందే రాత్రి
నా కౌగిలిలో ఈ రాగిణితో
తొలకరి వలపుల తొలిరాత్రి
ఆఖరి పిలుపుల తుదిరాత్రి

పున్నమిరాత్రి పువ్వులరాత్రి
వెల్లువ నాలో
పొంగిన వెన్నెల రాత్రి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: