తారాగణం: శోభన్‌బాబు,సుహాసిని,రాధిక
గాయకులు: బాలు, సుశీల
సంగీతం: చక్రవర్తి
దర్శకత్వం: ఏ.కోదండరామిరెడ్డి
విడుదల: 1984
పల్లవి:
వెండిచందమామలు వేయి తీపిరాత్రులు
వెండిచందమామలు వేయి తీపిరాత్రులు
ఎండపూలజల్లులు ఎవరికోసమో
ఒకరికోసమొకరున్న జంటకోసము
బంధమైన అందమైన బ్రతుకుకోసము
వెండిచందమామలు వేయి తీపిరాత్రులు
వెండిచందమామలు వేయి తీపిరాత్రులు
ఎండపూలజల్లులు ఎవరికోసమో
ఒకరికోసమొకరున్న జంటకోసము
బంధమైన అందమైన బ్రతుకుకోసము
చరణం1:
గడియలైన కాలమంతా ఘడియైనా వీడలేని
గాడమైన మమతలు పండే కౌగిలికోసం
మధువులైన మాటలన్ని పెదవులైన ప్రేమలోని
తీపి తీపి ముద్దులుకొసరే వలపులకోసం
నవ్వే నక్షత్రాలు రవ్వల చాందినీలు
పండినవి కలలు అవి పరిచయ కానుకలు
నీవులేక నాకు రాని నిదురకోసము
నిన్ను తప్ప చూడలేని కలలకోసము
వెండిచందమామలు వేయి తీపిరాత్రులు
చరణం2:
తనువులైన బంధమంతా క్షణమైనా వీడలేని
అందమైన ఆశలుపూసే ఆమనికోసం
పల్లవించు పాటలన్ని వెలుగులైన నీడలలోనే
తోడు నేను ఉన్నానన్న మమతలకోసం
వెలుగుల కార్తీకాలు వెచ్చని ఏకాంతాలు
పిలిచే కోయిలలు అవి కొసరే కోరికలు
నిన్ను తప్ప కోరుకోని మనసుకోసము
నీవు నేను వేరుకాని మనువుకోసము
వెండిచందమామలు వేయి తీపిరాత్రులు
వెండిచందమామలు వేయి తీపిరాత్రులు
ఎండపూలజల్లులు ఎవరికోసమో
ఒకరికోసమొకరున్న జంటకోసము
బంధమైన అందమైన బ్రతుకుకోసము
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment