గాత్రం: ఘంటసాల,సుశీల
పల్లవి:
నీవు నేను కలిసిన నాడే
నింగి నేల కలిసెనులే
నీవే నేనై నిలచిన నాడే
జీవనరాగం తెలిసెనులే
నీవు నేను కలిసిన నాడే
నింగి నేల కలిసెనులే
చరణం1:
అలలై పిలిచే నీ అందాలే
వలపు తేనియలు చిలికెను నాలో
అలలై పిలిచే నీ అందాలే
వలపు తేనియలు చిలికెను నాలో
నీలో సాగే అనురాగాలే
నీలో సాగే అనురాగాలే
వేణువులూదెను నాలో లోలో
నీవు నేను కలిసిన నాడే
నింగి నేల కలిసెనులే
నీవే నేనై నిలచిన నాడే
జీవనరాగం తెలిసెనులే
చరణం2:
నీలో విరిసే దరహాసాలే
పాలవెల్లులై పొంగెను నాలో
నీలో విరిసే దరహాసాలే
పాలవెల్లులై పొంగెను నాలో
జగమును దాటి గగనము మీటి
జగమును దాటి గగనము మీటి
ఎగిసెను ఊహలు నాలో లోలో
నీవు నేను కలిసిన నాడే
నింగి నేల కలిసెనులే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment