Jun 16, 2009

సూర్యవంశం

గాత్రం:చిత్ర
సాహిత్యం:సామవేదం షణ్ముఖశర్మ

పల్లవి:

రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే

నాలో కదిలే ప్రాణాలే ఒక పాటై నిన్నే చేరాలే
రోజావే చిన్ని రోజావే

చరణం1:

ఆకాశం అందాలంటు దూకే కెరటంలా ప్రేమే నాలో
ఆ హోరు నీ పేరునే పలికే మంత్రంలా నా గుండెలో
దారంతా చలువ పందిళ్ళే వేసి నీ కోసం నీడై ఉన్నా
నాలో నేనే లేనే లేను నేను నిన్నే నాలో కోలువుంచాను
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
రోజావే చిన్ని రోజావే

చరణం2:

మెరుపంటి నీ రాకకే మనసే మేఘంలా మారిందిలే
చిరుగాలై తలపే తాకి కదిలి నిలువెల్లా కరిగిందిలే
తొలి చినుకే తాకే నేలల్లే నేనే పులకించా నీ ఊహతో
దైవం ముందు దీపం లాగ నిన్నే చూస్తూ కాలం గడిపేస్తగ

||

No comments: