పల్లవి:
అందాల రూపము ఆనంద దీపము
కనుదోయి విందుచేయు మందమంద హాసము
అందుకే ఆ మోహము ఇందుకే ఈ స్నేహము
అందాల రూపము ఆనంద దీపము
కనుదోయి విందుచేయు మందమంద హాసము
అందుకే ఆ మోహము ఇందుకే ఈ స్నేహము
అందాల రూపము
చరణం1:
ప్రేమతరంగము నా అంతరంగము
చెంగుచెంగున దూకే పసిడి పూరంగము
వినువీధులలో విహరించేటి
వినువీధులలో విహరించేటి
ఆ చందమామ మీద అట్టే నిలిచిపోయెను
అందుకే ఆ మోహము ఇందుకే ఈ స్నేహము
అందాల రూపము ఆనంద దీపము
కనుదోయి విందుచేయు మందమంద హాసము
అందుకే ఆ మోహము ఇందుకే ఈ స్నేహము
అందాల రూపము
చరణం2:
నీ కనుసన్నల్లు నీ చిరునవ్వులు
అరవిరిసిన విరజాజి మల్లెపువ్వులు
నీ మురిపాలు నీ సరసాలు
ఏమారు మరువలేక వెర్రిదాననైతిని
అందుకే ఆ మోహము ఇందుకే ఈ స్నేహము
అందాల రూపము ఆనంద దీపము
కనుదోయి విందుచేయు మందమంద హాసము
అందుకే ఆ మోహము ఇందుకే ఈ స్నేహము
అందాల రూపము
|
No comments:
Post a Comment