Jun 20, 2009

కాలాపాని

గాత్రం: బాలు, చిత్ర

పల్లవి:

చామంతీ పువ్వే విరబూసాను అంది సిరివిందంది
సింగారం గాంచి తొలిపొద్దుల్లో ముంచి ఎల ముద్దంది
లయలుగ హొయలు సిరులుగ శృతులు హొ
మదనుని తలపు మగసిరి మెరుపు హొ
కిలకిల పలుకుల మధురిమ హొ హొ
సరిగమపదనిస స్వరముల సాగేనా
చామంతీ పువ్వే విరబూసాను అంది సిరివిందంది
సింగారం గాంచి తొలిపొద్దుల్లో ముంచి ఎల ముద్దంది

చరణం1:

నింగి తారలేమో హారమాయె
వెన్నెలేమో వన్నెలాయె
నింగినేల హంగులాయె కన్నెకన్నుల్లో
అహ చుక్కలాంటి చక్కనోడు
చందమామ అందగాడు
చిక్కినాడు చిన్నవాడు పంటి కౌగిట్లో
ఎదనల్లుకోవాలి లతవోలె రావాలి
తీయని ఆ హాయి మైమరచిపోవాలి
ధ్యానం ధ్యాస ఆన రాగం భావం కానా
సాయం సంధ్యల్లోన ప్రాయం పరువం కానా
ఆనందం హరివిల్లేగా ఆమని స్వాగతమిచ్చెనుగా

చామంతీ పువ్వే విరబూసాను అంది సిరివిందంది
సింగారం గాంచి తొలిపొద్దుల్లో ముంచి ఎల ముద్దంది

చరణం2:

గండు తుమ్మెదొచ్చి గుండె గిల్లి మంతరించి మత్తుజల్లి
తోడిరాగం పాటలేవో పాడుకో అంది
వన్నెచిన్నెలన్ని తుళ్ళితుళ్ళి వంతులాడి మళ్ళిమళ్ళి
విందులీయ డీడిక్కంటూ ఈడుజోడంది
మాఘమును చూడుమా యాగమును చేయగా
మోహమును చేరుమా దాహమును తీర్చగా
కోరిక తీరే పూట తోడొచ్చింది పాట
ఆశల వేసవిలోన వేడెక్కింది వేట
మోగింది ఇక సన్నాయి పచ్చల పల్లకి ఎక్కెనహొ

సింగారం గాంచి తొలిపొద్దుల్లో ముంచి ఎల ముద్దంది
చామంతీ పువ్వే విరబూసాను అంది సిరివిందంది
లయలుగ హొయలు సిరులుగ శృతులు హొ
మదనుని తలపు మగసిరి మెరుపు హొ
కిలకిల పలుకుల మధురిమ ఆ ఆ ఆ
సరిగమపదనిస స్వరముల సాగేనా
చామంతీ పువ్వే విరబూసాను అంది సిరివిందంది
సింగారం గాంచి తొలిపొద్దుల్లో ముంచి ఎల ముద్దంది

||

No comments: