గాత్రం: ఏ.ఎం.రాజా
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
సంగీతం: ఎం.ఎస్.ప్రకాష్
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంస్థ: సంగీత ప్రొడక్షన్స్
విడుదల: 1958
పల్లవి:
ఆడువారి మాటలు రాక్ఎన్రోల్ పాటలు
ఆడువారి కోపాలు మాపైన పన్నీటి జల్లులు
ఆడువారి మాటలు రాక్ఎన్రోల్ పాటలు
ఆడువారి కోపాలు మాపైన పన్నీటి జల్లులు
చరణం1:
ఏమన్నా కాదంటారు తామన్నదె రైటంటారు
వాధించి సాధించి చేసేరు సాములు
ఏమన్నా కాదంటారు తామన్నదె రైటంటారు
వాధించి సాధించి చేసేరు సాములు వయ్యారి భామలు
కోసేవన్ని కోతలు
వేసేవన్ని ఫోజులు
చేసేవన్ని డాబులు
ఈ ఆడు లేడీలు బాబులే
ఆడువారి మాటలు రాక్ఎన్రోల్ పాటలు
ఆడువారి కోపాలు మాపైన పన్నీటి జల్లులు
చరణం2:
వీరీది వేషమైతే వారీది మోసమైతే
వేషాలు మోసాలు దాగేవి కావులే
వీరీది వేషమైతే వారీది మోసమైతే
వేషాలు మోసాలు దాగేవి కావులే దాగేవి కావులే
జోగు జోగు చూపులు
చూపుల్లోనే బ్రేకులు
జోగుల్లోనే షాకులు
ఈ ఆడు లేడీలు బాబులే
ఆడువారి మాటలు రాక్ఎన్రోల్ పాటలు
ఆడువారి కోపాలు మాపైన పన్నీటి జల్లులు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
|
1 comment:
TQ
Post a Comment