Jul 8, 2009

ఆకాశమంత

తారగణం: త్రిష,గణేష్,ప్రకాష్‌రాజ్,ఐశ్వర్య,జగపతిబాబు
గాత్రం: మధుబాలకృష్ణన్
సాహిత్యం: అనంత్‌శ్రీరాం
సంగీతం: విద్యాసాగర్
నిర్మాత: దిల్‌రాజు
దర్శకత్వం: రాధామోహన్
సంస్థ: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల: 2009





పల్లవి:

ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అమ్మరా
మేఘాల పల్లకి తెప్పిస్తా
లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా
చల్లని హాయినందిస్తా

మేఘాల పల్లకి తెప్పిస్తా
లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా
చల్లని హాయినందిస్తా
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అమ్మరా

చరణం1:

అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే
మధురమవు భావాలేవో ఊగే లోలోన
పలుకులే పైకొస్తే చిలిపిగా పిలుపిస్తే
పులకలే పదులై వేలై పొంగే నాలోన
లాలిపాటే నేనై లాలపోసేవాడ్నై
లాలనే నింపనా లేత హృదయాన

మేఘాల పల్లకి తెప్పిస్తా
లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా
చల్లని హాయినందిస్తా
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అమ్మరా

చరణం2:

ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం
ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం
అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు
అణుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం
క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా
పాపవే పాపవే నాన్న నయనాన

మేఘాల పల్లకి తెప్పిస్తా
లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా
చల్లని హాయినందిస్తా
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అమ్మరా
మేఘాల పల్లకి తెప్పిస్తా
లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా
చల్లని హాయినందిస్తా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: