Jul 7, 2009

లిటిల్ సోల్జర్స్

సాహిత్యం: సీతారామశాస్త్రి

పల్లవి:

అడగాలనుంది ఒక డౌటుని సన్ రైజ్ లేని రోజేదని
మరి ఎవ్రిడేని సండే అని అనుకుంటే తప్పు కాదా అని
అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్ళు ఒప్పుకోరు
పదమంటూ స్కూల్ కేసి సిక్సు డేసు తరుముతారు
ఏ ఏ అయ్యయో ఎంత తప్పో ఎవరూ అడగరే
హ్యపీగా ఆడుకుంటాం అంటే వదలరే
అడగాలనుంది ఒక డౌటుని సన్ రైజ్ లేని రోజేదని

చరణం1:

నీ హైటే నాకు ఉంటే
అమ్మో ఎంత డేంజర్
నాక్కూడా మీసముంటే
ఎంచేస్తావు మేజర్
క్లాస్ మిస్ చైరులోన నేను కుర్చుంటా
కామిక్ క్లాస్ బుక్స్ చేసి చదివిస్తా
స్చూల్‌కి ప్రిన్సిపాల్ సార్‌నే అవుతా
ఆల్వేస్ హాలిడేస్ ఆడుకోండి అంటా
ఎగ్జాంస్ వస్తే అప్పుడు ఎలా మరి
మార్కులు కూడా మీరే వేస్తే సరి

అయ్యయో ఎంత తప్పో ఎవరూ అడగరే
హ్యపీగా ఆడుకుంటాం అంటే వదలరే

చరణం2:

చాలమ్మ ఆటలింక
కొంచం ఆగు మమ్మి
రానంటే వెళ్ళిపోతా
నో నో వద్దు డాడి
ఆటకైనా పాటకైనా ఆఖరంటూ లేదా
అకలేస్తే అప్పుడైనా అమ్మ గుర్తురాదా
పిట్టలైనా పొద్దుపోతే గూడు చేరుకోవా
పిల్లలైనా పెద్దలైనా రాత్రి నిద్దరోరా
నైటే రాని చోటే చూస్తే సరి
అక్కడ ఆటకు బ్రేకులు ఉండవు మరి
ఎంచక్కా నిద్దరోయి కలలో జారుకో
ఆ కలతో నువ్వు కోరే చోటే చేరుకో

అడగాలనుంది ఒక డౌటుని సన్ రైజ్ లేని రోజేదని
మరి ఎవ్రిడేని సండే అని అనుకుంటే తప్పు కాదా అని
అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్ళు ఒప్పుకోరు
పదమంటూ స్కూల్ కేసి సిక్సు డేసు తరుముతారు
ఏ ఏ అయ్యయో ఎంత తప్పో ఎవరూ అడగరే
హ్యపీగా ఆడుకుంటాం అంటే వదలరే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: