గాత్రం: ఘంటశాల,సుశీల
సాహిత్యం: పింగళి
పల్లవి:
మోహనరాగమహా మూర్తిమంతమాయే
మోహనరాగమహా మూర్తిమంతమాయే
నీ ప్రియరూపము కన్నుల ముందర నిలచిన చాలునులే
మోహనరాగమహా మూర్తిమంతమాయే
చరణం1:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చిత్రసీమలో వెలయగజేసి దివ్యగానమున జీవముపోసి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చిత్రసీమలో వెలయగజేసి దివ్యగానమున జీవముపోసి
సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసియేయనగా
మోహనరాగమహా మూర్తిమంతమాయే
చరణం2:
నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకే రూపమురాగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకే రూపమురాగా
ఆరాధించిన ప్రియభావమిలా పరవశించెననగా
మోహనరాగమహా మూర్తిమంతమాయే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment