Aug 14, 2009

వెంగమాంబ

గాత్రం: చిత్ర
సాహిత్యం: వెంగమాంబ




శ్రీరఘురామ నీ కృపను చెల్వము మీరగ
శ్రీగణేషునిన్ వారిజగర్భునిన్
భవుని వాణిని దుర్గను క్షేత్రపాలకున్
సారెకు సర్వదేవతల సత్కవిశూరెలనెల్ల
భక్తి నిన్ కోరి భజింతునయ్య
తరిగొండ నృసింహ దైవాపయోనిధి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

రారా గోపాలస్వామి రారా
ఊరకే వగలేల చేసేవురా
రారా గోపాలస్వామి రారా
మారుడు నిర్దయను సారె సారెకు బాణవర్ష ధారలు కురిసి
నాతో పోరాటమ్మునకు వచ్చే
రారా గోపాలస్వామి రారా

నాగాభరణా తే నమోనమో
భవ నాగ మృగేంద్రతే నమోనమో
నాగాభరణా తే నమోనమో
గరళకందరా గంగాధర హర స్మర సంహర శ్రీ మహితాత్మ
గురువర శ్రీ తరిగొండ పురాధిప నరహరి సఖతే నమోనమో
నాగాభరణా తే నమోనమో

ఎందుకే నీకింత మోహము
చిత్తమా పరమానందమా
కైవల్యమా ఈ దేహము
అందమై ఇంద్రియ విషయ బృందములను విరిగి
కిందు మీదు తెలియలేక అందమా చందమా ఆనందమా
ఎందుకే ఎందుకే చిత్తమా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: