Aug 18, 2009

సత్యం

గాత్రం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల



పల్లవి:

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా
కాళిదాసులాగ మారి కవితే రాసేశా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా
పగలు రాత్రి వెతికి వెతికీ నీకే లైనేశా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా
కాళిదాసులాగ మారి కవితే రాసేశా

చరణం1:

ట్రిపులెక్స్ రమ్ములోన కిక్కు లేదు హల్లో మైనా
నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా
సన్ లైట్ వేళ నుంచి మూన్ లైట్ వెళ్ళేదాకా
ఫుల్ టైం నా గుండెల్లో హాటులైన్ నీవేగా
ఓ లలనా ఇది నీ జాలమా
నీ వలన మనసే గాయమా
కుదురేమో లేదాయే
నువు నమ్మవు గాని కలవరమాయే
మగువా ఓ మగువా ఓ మగువా

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా
కాళిదాసులాగ మారి కవితే రాసేశా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా

చరణం2:

కో అంటే కోటిమంది అందగత్తెలున్నా గాని
నీ జంటే కోరుకుంటే దంచుతావే కారాన్ని
క్రేజీగా ఉంటే చాలు ప్రేమలోన పడతారండి
ట్రూ లవ్వే చూపుతుంటే పెంచుతారు దూరాన్ని
ఓ మగువా నీకే న్యాయమా
ఎదలో ప్రేమే శాపమా
మనసేమో బరువాయె
నీ మాటలు లేక మోడైపోయే
మగువా ఓ మగువా ఓ మగువా

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా
కాళిదాసులాగ మారి కవితే రాసేశా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: