Aug 19, 2009

శివరంజని

గాత్రం: బాలు
సాహిత్యం: సి.నారాయణరెడ్డి





పల్లవి:

అభినవ తారవో నా అభిమాన తారవో
అభినవ తారవో
అభినయ రసమయ కాంతిధారవో
అభినయ రసమయ కాంతిధారవో
మంజుల మధుకర శింజాన సుమశర శింజినీ
శివరంజనని శివరంజని

చరణం1:

అది దరహాసమా మరి మధుమాసమా
అది దరహాసమా మరి మధుమాసమా
ఆ మరునికి దొరికిన అవకాశమా
అవి చరణమ్ములా శశి కిరణమ్ములా
అవి చరణమ్ములా శశి కిరణమ్ములా
నా తరుణభావనా హరిణమ్ములా

అభినవ తారవో నా అభిమాన తారవో ఓ ఓ ఓ
అభినవ తారవో
శివరంజని శివరంజనని

చరణం2:

ఆ నయనాలు విరిసిన చాలు
అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నయనాలు విరిసిన చాలు
అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నెన్నడుము ఆడిన చాలు
ఆ నెన్నడుము ఆడిన చాలు
రవళించు పదకవితా ప్రభంధాలు

అభినవ తారవో నా అభిమాన తారవో ఓ ఓ ఓ
అభినవ తారవో
శివరంజని శివరంజనని

చరణం3:

నీ శృంగార లలిత భంగిమలో పొంగి పోదురే ఋషులైనా
నీ కరుణరసావిష్కరణంలో కరిగి పోదురే కర్కసులైనా
వీరమా నీ కుపిత నేత్ర సంచారమే
హాస్యమా నీకది చిటికెలోన వశ్యమే
నవరస పోషణ చణవనీ
నటనాంకిత జీవనివనీ
నిన్ను కొలిచి వున్నవాడ
మిన్నులందుకున్నవాడ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ ఆరాధకుడను ఆస్వాదకుడను అనురక్తడను
నీ ప్రియభక్తుడను

అభినవ తారవో నా అభిమాన తారవో ఓ ఓ ఓ
అభినవ తారవో
శివరంజని శివరంజనని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: