తారాగణం: లీచింగ్ మావ్,యాహుహు
గాత్రం: చిత్ర
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నిర్మాత: చావ సుధారాణి
దర్శకత్వం: ఫెంగ్ జెంజి
సంస్థ: సుజన మీడియా వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల: 2009
పల్లవి:
ఆరాటం ముందు ఆటంకం ఎంత
సంకల్పం ముందు వైకల్యం ఎంత
ధృడచిత్తం ముందు దురదృష్టం ఎంత
ఎదురీత ముందు విధిరాత ఎంత
నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా
ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా
ఆరాటం ముందు ఆటంకం ఎంత
సంకల్పం ముందు వైకల్యం ఎంత
ధృడచిత్తం ముందు దురదృష్టం ఎంత
ఎదురీత ముందు విధిరాత ఎంత
చరణం1:
చేజారెను చేతులు చెదిరేను గీతలు
చేజారెను చేతులు చెదిరేను గీతలు
బెదిరించిన భాదలే వివరించెను భోదలు
పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా
పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా
మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా
ఆరాటం ముందు ఆటంకం ఎంత
సంకల్పం ముందు వైకల్యం ఎంత
ధృడచిత్తం ముందు దురదృష్టం ఎంత
ఎదురీత ముందు విధిరాత ఎంత
చరణం2:
పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం
అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం
చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం
సహనంతో ఉంటే దొరికింది సైన్యం
చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం
పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం
అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం
చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం
సహనంతో ఉంటే దొరికింది సైన్యం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
2 comments:
was trying a lot for this song
first time vinapudu romaalu nikkapaduchukunnay......
thanka a lot
విహారి గారు,
ఈ పాట పెట్టినందుకు చాలా థాంక్సండి...ఎప్పుడు వినాలనున్నా మీ సైటుకే వచ్చి వినటం అలవాటు..ఇప్పటికి చాలా సార్లు విన్నాను..ఈ రోజు ఎందుకో మీకు థాంక్స్ చెప్పాలనిపించి ఇలా...
మీ పాటల కలెక్షన్స్ అన్నీ బాగున్నాయి.
Post a Comment