Sep 2, 2009

విప్రనారాయణ

గాత్రం:ఏ.ఎం.రాజా



పల్లవి:

రంగా శ్రీరంగా నా మొర వినరా నీ దరిజేరుచుకోరా
దరిజేరుచుకోరా రంగా నా మొర వినరా శ్రీరంగా
దరిజేరుచుకోరా రంగా

చరణం1:

ఎరుగను వేదపురాణ రహస్యము
ఎరుగను నీ పద బాగుణ సేవ
తిరిగితిరిగి పెడదారులలో
తిరిగితిరిగి పెడదారులలో
నిజమెరిగి నిన్ను శరణంటినిరా
దరిజేరుచుకోరా రంగా నా మొర వినరా శ్రీరంగా
దరిజేరుచుకోరా రంగా

చరణం2:

శరణటన్న కరిరాజును కావగ
పరుగున దూకిన శ్రీరంగా
శరణటన్న కరిరాజును కావగ
పరుగున దూకిన శ్రీరంగా
పరిహరించు నా భవభందముల
శరణాగత జనపాలా శ్రీరంగా శ్రీరంగా


||

No comments: