సాహిత్యం: రావూరి
గాత్రం: ఘంటసాల,పిఠాపురం నాగేశ్వరరావు,భానుమతి
సంగీతం: జి.రామనాథన్
నిర్మాత & దర్శకత్వం: పి.ఎస్.రామకృష్ణారావు
సంస్థ: భరణీ పిక్చర్స్
విడుదల: 1957
పల్లవి:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అందచందాల ఓ తారక చెరరావే చెలి నా దరి
నా మది దోచిన రాణివే
అందచందాల ఓ జాబిలి చెరరావా ప్రియా నా దరి
నా మది దోచిన రాజువై
చరణం1:
పూలతీరాలకు వాడు డోలవై
డోలలూగే సరాగాల మాలవై
పూలతీరాలకు వాడు డోలవై
డోలలూగే సరాగాల మాలవై
తేలిరా గాలులా తూలిరా పూవులా
తేనెల కోనల జాలువై
పూలతీరాలకు వాడు తేటివై
తేటి రాగాల సాగేటి పాటవై
పూలతీరాలకు వాడు తేటివై
తేటి రాగాల సాగేటి పాటవై
తేలిరా గాలులా తూలిరా పూవులా
తేనెల కోనల జాలువై
అందచందాల ఓ జాబిలి చెరరావా ప్రియా నా దరి
నా మది దోచిన రాజువై
అందచందాల ఓ తారక చెరరావే చెలి నా దరి
నా మది దోచిన రాణివే
చరణం2:
అహహా ఒహొహొ అహహా ఒహొహొ
ఓ ప్రేయసి నా ప్రేయసి
సిసలైన గోల్డు మన ప్రేమ
నా కోహినూర్ డైమండువే
నా తలపైన కూర్చోవె
తన్నన్న నాన తన్నన్న నాన
అహహా ఒహొహొ అహహా ఒహొహొ
ఓ ప్రేయసి నా ప్రేయసి
సిసలైన గోల్డు మన ప్రేమ
నా కోహినూర్ డైమండువే
నా తలపైన కూర్చోవె
తన్నన్న నాన తన్నన్న నాన
సందేహమా ఓ దేహమా మరి ప్రేమంటె లోహమా
నీ అందము నా చందము మెచ్చేనోయి ఓ వామన
తన్నన్న నాన తన్నన్న నాన
తన్నన్న నాన తన్నన్న నాన
సందేహమా ఓ దేహమా మరి ప్రేమంటె లోహమా
నీ అందము నా చందము మెచ్చేనోయి ఓ వామన
ఒహొహొ హొహొ హహహ హహ
ప్రేమించవా పాలించవా దయ రాదా నా మీద
సంసారమో సన్యాసమో ఇక తేల్చాలె ప్రియురాల
హహహహ హాహ ఒహొహొహొ హొహొ
|
No comments:
Post a Comment