గాత్రం: సునీత
సాహిత్యం: వేదవ్యాస
పల్లవి:
మాయామయ జగతి మాధవా మసలితి
కాలమంత కాళరాత్రి కన్నుల్లో కరగితి
మరలి మరలి మతిమాలి మరుభూమి తిరిగితి
హరి అలసితి
హరి సొలసితి
చరణం1:
స్వామి నీ మోహంతో
నీ సేవా దాహంతో
ప్రతిక్షణం నీకోసం ప్రతీక్షించితి
హరి అలసితి
హరి సొలసితి
చరణం2:
నీ ఊహల ఊపిరుల గాలి పీల్చితి
నీ అడుగుల అడుగేసి ఏడడుగులు నడచితి
అహర్నిశలు నీకోసం పరితపించితి
ఇకపై ఒక నిమిషమైన నిను వీడలోనైతి
నన్నేలుము నా పతి
హరి హరి అలసితి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment