Sep 18, 2009

పెళ్ళి సందడి

గాత్రం: కీరవాణి,మనో,చంద్రబోస్
సాహిత్యం: చంద్రబోస్




పల్లవి:

నీ అక్కకు మొగుడైనందుకు నీకు పెళ్ళిచేసే బాధ్యత నాది
ఓరి బామ్మర్ది నీ కలలోకొచ్చిన చిన్నదీ ఈ ఈ ఎవరది

ఎలాగుంటది
రమ్యకృష్ణలాగ ఉంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న
రంభలాగ రంజుగుంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న
ఇంద్రజ ఆమని లుక్కు ఉందా
శోభన గౌతమి షేపు ఉందా
చెప్పకుంటె దాని జాడ ఎట్ట తెలుసుకోమురా
రమ్యకృష్ణలాగ ఉంటదా అరె చెప్పర కన్నా చెప్పర నాన్న

చరణం1:

ఏక్ దో తీన్ సాంగుతో యవ్వనాల ఎర వేసిన మాధురీదీక్షితా
వెన్నపూస వన్నెలతో జున్నుముక్క బుగ్గలున్న

జుహీచావ్లానా
అరేబియన్ గుర్రమంటి నలక నడుము నగ్మానా
అరె కుస్తాబహార్ అనిపించే కుర్రపిల్ల కుష్బునా
నీ మగసిరి మెచ్చుకుంది మమతాకులకర్ణా
నీ టాపు లేపింది టాబునా
శిల్పాశెట్టి లాంటి చిలక భామా
శ్రీదేవి లాంటి చందమామా హే హే హే
మోహిని రూపిణి రేవతినా
చెప్పరా నాయనా ప్రియారామనా
ఒక్క ముక్క చెప్పు చాలు మోగుతాది పెళ్ళిడోలు

రమ్యకృష్ణలాగ ఉంటదా అరె చెప్పర కన్నా చెప్పర నాన్న
రంభలాగ రంజుగుంటదా ఆ చెప్పర కన్నా చెప్పర నాన్న

చరణం2:

కుర్రోళ్ళు ముసలోళ్ళు వెర్రెక్కి వేడెక్కే నవ్వుల

రోజానా
శోభనపు పెళ్ళికూతురల్లే తెగ సిగ్గుపడే సొగసరి మీనానా
బెల్లంముక్కలాంటి బుల్లి గడ్డమున్న సౌందర్యా
యువకులకి పులకరింత పూజాభట్టేనా
రవ్వలడ్డులాంటి పిల్ల మాలాశ్రీయా
దేశాన్నే ఊపేసిన భాగ్యశ్రీయా
మనీషా కొయిరాల పోలికలోన అహ
మతిపోయే మధుబాల మాదిరి జాణ హే హే హే
అంజలి రంజని శుభశ్రీయా
ఊర్వశీ కల్పన ఊహలానా
హింటు ఇస్తె చాలు మాకు జంట నీకు చేస్తాము

రమ్యకృష్ణలాగ ఉంటదా అబ్బ చెప్పర కన్నా చెప్పర నాన్న
రంభలాగ రంజుగుంటదా హే చెప్పర కన్నా చెప్పరా నాన్న
చెప్పమ్మా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: