గాత్రం: చిత్ర
సాహిత్యం: సీతారామశాస్త్రి
పల్లవి:
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటం
నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది
ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెపాలదీ
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటం
చరణం1:
వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా
కంటికెదురుపడతావేంటి ఎటు చూసినా
చెంప గిల్లి పోతావేంటి గాలి వేలితోన
అంత గొడవ పెడతావేంటి నిద్దరోతు ఉన్నా
అసలు నీకు ఆ చొరవే ఎంటి తెలియకడుగుతునా
ఒంటిగా ఉండనీయవేంటి ఒక్క నిమిషమైన
ఇదేం అల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరను
నువ్వేం చేసినా బాగుంటుందని నిజం నీకెలా చెప్పను
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటం
చరణం2:
నువ్వు నవ్వుతుంటే ఎంతో చూడముచ్చటైనా
ఏడిపించ బుద్దవుతుంది ఎట్టాగైన
ముద్దుగానె ఉంటావేమో మూతి ముడుచుకున్నా
కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా
నిన్ను రెచగొడుతూ నేనే ఓడిపోతు ఉన్నా
లేని పోని ఉక్రోషంతో ఉడుకెత్తనా
ఇదేం చూడక మహ బోరుగా ఏటో నువ్వు చూస్తూ ఉన్నా
అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడి చస్తున్నా అయ్యో రామా
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటం
నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది
ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెపాలదీ
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ ఐ లవ్ యూ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
ఐ లవ్ యూ
ఐ లవ్ యూ
ఐ లవ్ యూ
ఐ లవ్ యూ
ఐ లవ్ యూ
ఐ లవ్ యూ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment