Sep 20, 2009

సూర్యా ఐ.పి.ఎస్


గాత్రం: బాలు,చిత్ర

పల్లవి:

ఓం నమోనమ: యవ్వనమా రావమ్మ
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమ
ఓం నమోనమ: యవ్వనమా రావమ్మ
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమ
ఈ చిటపట చింత
నీ దయే కదా అంతా
ఇక చేసేదేముంది అయ్యో రామా
ఓం నమోనమ: యవ్వనమా రావమ్మ
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమ

చరణం1:

ఏపుగ ఊగే ఒంపుల పైరు కోతకు సయ్యందే హహహా
ఊపుగ రేగే చూపుల ఏరు కోతను కోసిందే
కొంగెట్టి కూసే రంగుల ఊసే
ఒంగొంగి చూసే లొంగని ఆశే
వెర్రెక్కే కన్ను వేటాడెనే నిన్ను
ఏమూల దాచేది సింగారం

ఓం నమోనమ: యవ్వనమా రావమ్మ
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమ
ఈ చిటపట చింత
నీ దయే కదా అంతా
ఇక చేసేదేముంది అయ్యో రామా
ఓం నమోనమ: యవ్వనమా రావమ్మ
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమ

చరణం2:

ఏటికిసైతం ఏతం వేసే వేగం బాగుందే
పైటకు సైతం పాటలు నేర్పే రాగం లాగిందే హొయ్
ఏకల్లే చేరి మేకైనావు
సోకుల్లో ఊరి చెలరేగావు
తాంబూలం తెచ్చా తడిపొడి పంచా
ఎన్నాళ్ళు మోస్తావు వయ్యారం

ఓం నమోనమ: యవ్వనమా రావమ్మ
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమ
ఈ చిటపట చింత
నీ దయే కదా అంతా
ఇక చేసేదేముంది అయ్యో రామా
ఓం నమోనమ: యవ్వనమా రావమ్మ
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమ

||

No comments: