Sep 24, 2009

ఒక రాధ ఇద్దరు కృష్ణులు

తారాగణం: కమల్‌హాసన్,శ్రీదేవి
గాత్రం: బాలు,జానకి
సాహిత్యం: వేటూరి
సంగీతం: ఇళయరాజా
దర్శత్వం: కోదండరామిరెడ్డి
సంస్థ: శ్రీ సరస మూవీస్
విడుదల: 1985




పల్లవి:

మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి పొంగె ఎద పొంగె
ఈ బృందా విహారాలలోన నా అందాలు నీవేరా కన్న
ఈ బృందా విహారాలలోన నా అందాలు నీవేరా కన్న
మధుర మురళి హృదయ రవళి
ఎదలు కలుపు ప్రణయ కడలి సాగే సుడి రేగే
ఈ బృందా విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఈ బృందా విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా

చరణం1:

గోధూళి వేళల్లో గోపెమ్మ కౌగిట్లో
లేలేత వన్నే చిన్నే దోచే వేళల్లో
పున్నాగ తోటల్లో సన్నాయి సందిట్లో
నాజూకులన్నీ నాకే దక్కేవేళల్లో
పగలో అవతారం రాత్రో శృంగారం
ఎదలో తారంగం శ్రీవారికీ
రాగాలెన్నైనా వేణువు ఒకటేలే
రూపాలెన్నైనా హృదయం ఒకటేలే
నాదే నీ గీతము ఇక నీదే ఈ సరసాల సంగీతం

మధుర మురళి హృదయ రవళి
ఎదలు పలకు ప్రణయ కడలి సాగే సుడి రేగే
ఈ బృందా విహారాలలోన నా అందాలు నీవేరా కన్నా
ఈ బృందా విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా

చరణం2:

హేమంత వేళల్లో లేమంచు పందిట్లో
నా వీణ ఉయ్యాలూగే నీలో ఈనాడే
కార్తీక వెన్నెల్లో ఏకాంత సీమల్లో
ఆరాధనేదో సాగే అన్నీ నీవాయే
ముద్దే మందారం మనసే మకరందం
సిగ్గే సింధూరం శ్రీదేవికీ
అందాలెన్నైనా అందేదొకటేలే
ఆరు ఋతువుల్లో ఆమని మనదేలే
పాటే అనురాగము
మన బాటే ఓ అందాల అనుబంధం

మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి పొంగె ఎద పొంగె
ఈ బృందా విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఈ బృందా విహారాలలోన నా అందాలు నీవేరా కన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: