Sep 24, 2009

మహామంత్రి తిమ్మరుసు

తారాగణం: రామారావు,గుమ్మడి,ఎస్.వరలక్ష్మి,దేవిక,ఎల్.విజయలక్ష్మి
గాత్రం: ఎస్.వరలక్ష్మి,పి.సుశీల
సంగీతం: పెండ్యాల
దర్శకత్వం: కమలాకర కమేశ్వరరావు
విడుదల: 1962

పల్లవి:

తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిమి వరముల కురియుమయ
ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిమి వరముల కురియుమయ
చెలిమిని నిలిచే అలమేల్మంగమ చెలువములే ప్రియసేవలయ
తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిమి వరముల కురియుమయ

చరణం1:

నయగారాలను నవమల్లికలా మమకారలాను మందారములా
నయగారాలను నవమల్లికలా మమకారలాను మందారములా
మంజుల వలపుల మళయానిలముల
మంజుల వలపుల మళయానిలముల
వింజామరమున వీచుమయా
తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిమి వరముల కురియుమయ

చరణం2:

ఆశారాగమే ఆలాపనగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆశారాగమే ఆలాపనగా సరసరీతుల స్వరమేలనా
ఆశారాగమే ఆలాపనగా సరసరీతుల స్వరమేలనా
అభినయనటనలే ఆరాధనగా
అభినయనటనలే ఆరాధనగా ప్రభునలరించి తరింతుమయ

తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిమి వరముల కురియుమయ
చెలిమిని నిలిచే అలమేల్మంగమ చెలువములే ప్రియసేవలయ
తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిమి వరముల కురియుమయ

||

No comments: