సాహిత్యం: అనిసెట్టి సుబ్బారావు
పల్లవి:
బంగారు బొమ్మ రావేమే
పందిట్లో పెళ్ళి జరిగేనే
బంగారు బొమ్మ రావేమే
పందిట్లో పెళ్ళి జరిగేనే
కల్యాణ శోభ కనగానే
కనులార తనివి తీరేనే
బంగారు బొమ్మ రావేమే
పందిట్లో పెళ్ళి జరిగేనే
చరణం1:
ఎనలేని నోము నోచి
నీవీరోజుకెదరు చూచి
మురిపించి మనసు దోచి
మది ముత్యాల ముగ్గులేసీ
కలగన్న ఘడియ రాగానే
తలవంచి బిడియ పడరాదే
కలగన్న ఘడియ రాగానే
తలవంచి బిడియ పడరాదే
ఓ బంగారు బొమ్మ రావేమే
పందిట్లో పెళ్ళి జరిగేనే
చరణం2:
అందాల హంస నడక
ఈ అమ్మాయి పెళ్ళి నడకా
ఓయమ్మ సిగ్గు పడకే
వేచియున్నాడు పెళ్ళి కొడుకే
నూరేళ్ళ పంట పండేనే
గారాల సిరులు పెరిగేనే
నూరేళ్ళ పంట పండేనే
గారాల సిరులు పెరిగేనే
ఓ బంగారు బొమ్మ రావేమే
పందిట్లో పెళ్ళి జరిగేనే
చరణం3:
మనసైన వాడు వరుడు
నీ మదినేలుకొనెడు ఘనుడు
వేసేను మూడుముళ్ళు
ఇక కురిసేను పూలజల్లు
ఈ ఏటికిరువురొకరైతే
మీదటికి ముగ్గురౌతారే
ఈ ఏటికిరువురొకరైతే
మీదటికి ముగ్గురౌతారే
ఓ బంగారు బొమ్మ రావేమే
పందిట్లో పెళ్ళి జరిగేనే
బంగారు బొమ్మ రావేమే
పందిట్లో పెళ్ళి జరిగేనే
|
No comments:
Post a Comment