Jan 8, 2010

దేవుళ్ళు

గాత్రం: చిత్ర,స్వర్ణలత
సాహిత్యం: జొన్నవిత్తుల




పల్లవి:

మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిని ఆడే చందమామలం
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిని ఆడే చందమామలం
గోరుముద్దలెరుగనీ బాల కృష్ణులం
బాధ పైకి చెప్పలేని బాల ఏసులం
ఆలోచించండి ఓ అమ్మానాన్న
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిని ఆడే చందమామలం

చరణం1:

కమ్మగా మా అమ్మచేతితో
ఏ పూట తింటాము ఏడాదిలో
చక్కగా మా నాన్న పక్కగా
సరదాగ తిరిగేది ఏ నాటికో
పొద్దున్నే పరుగున వెళతారు
రాతిరికి ఎపుడో వస్తారు
మరి మరి అడిగినా కధలు చెప్పరు
మేమేం చెప్పినా మనసుపెట్టరు
అమ్మ నాన్న తీరు మాకు అర్ధమవ్వదు
ఏమి చెయ్యాలో మాకు దిక్కుతోచదు

ఆలోచించండి ఓ అమ్మానాన్న
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిని ఆడే చందమామలం

చరణం2:

పిల్లలం మీ చేతి ప్రమిదలం
మీ ప్రేమ చమురుతో వెలుగు దివ్వెలం
పువ్వులం మీ ఇంటి నవ్వులం
మీ గుండెపై ఆడు చిన్ని గువ్వలం
కనిపెంచే మీరే దేవుళ్ళు
కనిపించే శివుడు పార్వతులు
లోకం బూచికి మా గుండె వణికితే
మాకు ధైర్యమిచ్చేది మీ లాలింపే
అమ్మనాన్నలిద్దరూ వేరు వేరయి
అనాధలను చేయకండి పసిపిల్లలనీ

ఆలోచించండి ఓ అమ్మానాన్న
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిని ఆడే చందమామలం

||

No comments: