పల్లవి:
మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహొ

మది ఉయ్యాల
ప్రేమతో గగన వీధులలో హాయిగా ఎగిరి పోవుదమా

మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహ
చరణం1:
తీయని కోరికలూరెను నాలో తెలియదు కారణమేమో
ప్రేమ ఇదేనా ప్రణయమిదేనా...ప్రణయమిదేనా
ప్రేమ ఇదేనా ప్రణయమిదేనా...ప్రణయమిదేనా
నూతన యవ్వన సమయమున
మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహ
చరణం2:
చిన్నతనమేలా సిగ్గుపడనేల మన్ననలెందుకు మనలోన

ప్రేమలో కరగిపోవుదమా భేదమే మరచిపోవుదమా
ప్రేమలో కరగిపోవుదమా భేదమే మరచిపోవుదమా
మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహ
చరణం3:
ఓ చెలియా మన జీవితమంతా పున్నమ వెన్నెల కాదా ఆ
రేయి పగలు నే నిను మురిపించి నిను వలపించి
ప్రమ జగానికి కొనిపోనా
మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహ
మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహ
|
No comments:
Post a Comment