తారాగణం: మీనా,సాయికిరణ్,సన,శరత్‌బాబు
గాత్రం: కీరవాణి,సునీత
సాహిత్యం: వేటూరి
సంగీతం: కీరవాణి
దర్శకత్వం: ఉదయభాస్కర్
నిర్మాత: వి.దొరస్వామిరాజు
సంస్థ: వి.ఎం.సి.ప్రొడక్షన్స్
విడుదల: 2009
పల్లవి:
కృష్ణ పారిజాతాలను విరియించిన కొమ్మ
ఆరాధనలో రాధగ విరబూసిన రెమ్మ ఆ ఆ ఆ ఆ ఆ
తిరుకొండ హారతి తిరమైన కీరితి
తరిగొండ వేంగమాంబ తెలుగింటి భారతి
తిరుకొండ హారతి తిరమైన కీరితి
తరిగొండ వేంగమాంబ తెలుగింటి భారతి
చరణం1:
తన పతి వేంకటపతిగా ఆ ఆ
తన కృతి భవ నిష్కృతిగా
తన పతి వేంకటపతిగా ఆ ఆ ఆ
తన కృతి భవ నిష్కృతిగా
కృష్ణరాగమున శృతిగా
ద్విపద వాజ్ఞయాకృతిగా
హరి పాదము తన గతిగా
హరి నామమే తన స్తుతిగా
హరి నామమే తన స్తుతిగా
సతులకు తానొక యతిగా
తెలుగు జాతి వేకువగా
వెలిగినది వేంగమాంబ
తిరుకొండ హారతి తిరమైన కీరితి
తరిగొండ వేంగమాంబ తెలుగింటి భారతి
చరణం2:
బొట్టు కాటుక పూలు
మెట్టె తాళి గాజులు
పుట్టెడు పసుపు పసిడి
బొట్టు కాటుక పూలు
మెట్టె తాళి గాజులు
పుట్టెడు పసుపు పసిడి
పొలతి జన్మ హక్కులని
తన పాట తన బాట
తన బ్రతుకు భగవంతుడు
తన నాలుగు దిక్కులని
పలికినది వేంగమాంబ
పద కవితల శారదాంబ
పలికినది వేంగమాంబ
పద కవితల శారదాంబ
తిరుకొండ హారతి తిరమైన కీరితి
తరిగొండ వేంగమాంబ తెలుగింటి భారతి
తిరుకొండ హారతి తిరమైన కీరితి
తరిగొండ వేంగమాంబ తెలుగింటి భారతి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment