Feb 2, 2011

రక్షణ

తారాగణం: నాగార్జున, శోభన
గాత్రం: మాల్గాడి శుభ
సాహిత్యం: సీతారామశాస్త్రి
సంగీతం: కీరవాణి
నిర్మాత: వెంకట్
దర్శకత్వం: ఉప్పలపాటి నారాయణరావు
సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్
విడుదల: 1993

పల్లవి:

హా హా హా హా
హా హా హా హా
నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను ఆడనో చెప్పలేను యాడనో చెప్పలేను రా
గౌలిగూడ గల్లికాడ చల్లగా గిల్లినోడ పోకిరీ పోరగాడ జల్దినా జంటకూడరా
సంజైతలే నీ సంగతేందో
ఏ సందులో నీవుందువో మల్ల దెల్వలే
హా హా హా హా
నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను ఆడనో చెప్పలేను యాడనో చెప్పలేను రా
గౌలిగూడ గల్లికాడ చల్లగా గిల్లినోడ పోకిరీ పోరగాడ జల్దినా జంటకూడరా

చరణం1:

బేకారుగానే చిత్కాలన్ని ఎక్కెక్కి సూస్త ఉన్నా
రేషుదీయనా ఇంత ఇస్కి బొయినా
ఏ పోరగాన్తో ఈ సరుకంతా ఊకేనె ఇస్తనన్నా
ఇష్టమాయెనా ఇట్టే తీస్కుపాయెనా
ఏమాయే నా పుంజు ఎటుబాయే
తోడాయే కోడెగాడు రాడాయే
ఎన్నాళ్ళిలా ఈ కన్నె జర్నీ
అందాలిలా ఉండాలె ఎండాలె దెల్వలే
హా హా హా హా

నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను ఆడనో చెప్పలేను యాడనో చెప్పలేను రా
గౌలిగూడ గల్లికాడ చల్లగా గిల్లినోడ పోకిరీ పోరగాడ జల్దినా జంటకూడరా
హా ఆహా ఆహా

చరణం2:

ఆ పోరి ఎన్కే జారేవన్కో ఎన్కెన్క రాలేనా
ఊరుకుందునా పత్తా పట్టకుందునా హా
చేజారగానే బేజారయ్యే మామూలు లడ్కీనా
చేరకుందునా సత్తా చూపకుందునా
దునియాలో గల్లి గల్లి గాలిస్తా
ఎన్కాలే లొల్లి లొల్లి చేసేస్తా
చిర్రెత్తదా సింగారమంతా
చీకట్లకే సోకిచ్చుకోవాల దెల్వలే
హా హా హా హా

నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను ఆడనో చెప్పలేను యాడనో చెప్పలేను రా
గౌలిగూడ గల్లికాడ చల్లగా గిల్లినోడ పోకిరీ పోరగాడ జల్దినా జంటకూడరా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: