Feb 4, 2011

ఆనంద్

తారాగణం: రాజా,కమలిని ముఖర్జీ,సత్యా కృష్ణన్
గాత్రం: హరిహరన్,చిత్ర
సాహిత్యం; వేటూరి
సంగీతం: కె.ఎం.రాధాకృష్ణ
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
విడుదల: 2004




పల్లవి:

యమునాతీరం సంధ్యారాగం
యమునాతీరం సంధ్యారాగం
నిజమయినాయి కలలు నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో
యమునాతీరం సంధ్యారాగం
నిజమయినాయి కలలు నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో
యమునాతీరం సంధ్యారాగం

చరణం1:

ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా
పండెననుకో ఈ బ్రతుకే మనసుతీరా
శిధిలంగా విధినైనా చేసేదే ప్రేమ
హృదయంలా తననైనా మరిచేదే ప్రేమ
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనస కధ
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనస కధ
యమునాతీరం సంధ్యారాగం

చరణం2:

ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం
చిన్న నిట్టుర్పే గెలుపు మనకు సైతం
శిశిరంలో చలిమంటై రగిలేదే ప్రేమ
చిగురించే ఋతువల్లే విరబూసే ప్రేమ
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కధ
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కధ
యమునాతీరం సంధ్యారాగం
యమునాతీరం సంధ్యారాగం

~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~

No comments: