తారాగణం: సురేష్,ఆనంద్,రమ్యకృష్ణ,లిజి,సత్యనారాయణ
గాత్రం: బాలు,చిత్ర
సంగీతం: రాజ్ కోటి
నిర్మాత: రామోజీరావు
దర్శకత్వం: శరత్
సంస్థ: ఉషాకిరణ్ మూవీస్
విడుదల: 1990
పల్లవి:
కన్నులలో ఒక కాటుక లేఖ
కౌగిలిలో కసి కాముడి కేక
కన్నులలో ఒక కాటుక లేఖ
కౌగిలిలో కసి కాముడి కేక
కన్నానమ్మో విన్నానమ్మో
కవ్వింతల్లో ఉన్నానమ్మో
తార తార ముద్దాడంగ ఆకాశాలే రద్దయ్యేటి వేళ
కన్నులలో ఒక కాటుక లేఖ
కౌగిలిలో కసి కాముడి కేక
కన్నులలో ఒక కాటుక లేఖ
కౌగిలిలో కసి కాముడి కేక
చరణం1:
పరిచయమే పరిమళమై విసిరింది పూలబాణం
పెదవులలో కదలికలే తెలిపాయి తేనె దాహం
కలవని కలయికలా అలా వెచ్చని మచ్చికలా
గుండెల్లోనే గూడేస్తుంటే
ఈడుజోడు ఈలేస్తుంటే
ప్రేమ ప్రేమ పెళ్ళాడంగ
మంచిచెడ్డా మాటిచ్చాయి వేళ
కన్నులలో ఒక కాటుక లేఖ
కౌగిలిలో కసి కాముడి కేక
కన్నులలో ఒక కాటుక లేఖ
కౌగిలిలో కసి కాముడి కేక
చరణం2:
మనసునిలా మధువనినై వినిపించె వేణుగానం
వలపుకదే చిలిపికథై మొదలాయె మౌనరాగం
పిలవని పిలుపులలో అలా పిల్లనగ్రోవులలో
గాలే జోలై లాలిస్తుంటే
పూలే నాలో పూయిస్తుంటే
కన్ను కన్ను మాటాడంగా
నిన్నే నేను ప్రేమించానీవేళ
కన్నులలో ఒక కాటుక లేఖ
కౌగిలిలో కసి కాముడి కేక
కన్నానమ్మో విన్నానమ్మో
కవ్వింతల్లో ఉన్నానమ్మో
తార తార ముద్దాడంగ ఆకాశాలే రద్దయ్యేటి వేళ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment