గాత్రం:ఘంటసాల
సాహిత్యం:దాశరథి
పల్లవి:
దీనుల కాపాడుటకు దేవుడే వున్నాడు
దేవుని నమ్మినవాడు ఎన్నడు చెడిపోడు
ఆకలికి అన్నము వేదనకు ఔషధం
పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా
రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా
దీనులకు కాపాడ రారా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా
దీనులకు కాపాడ రారా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా రారా
చరణం1:
మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా
ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా
మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా
ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా
పేదల మొరలాలించే విభుడవు నీవే
కోరిన వరముల నొసగే వరదుడ నీవే
పేదల మొరలాలించే విభుడవు నీవే
కోరిన వరముల నొసగే వరదుడ నీవే
అజ్ఞ్యానపు చీకటికి దీపము నీవే
అన్యాయము నెదిరించే ధర్మము నీవే
నీవే కృష్ణా నీవే కృష్ణా నీవే కృష్ణా
రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా
దీనులకు కాపాడ రారా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా ఆ ఆ రారా కృష్ణయ్యా
చరణం2:
కుంటివాని నడిపించే బృందావనం
గుడ్డివాడు చూడగలుగు బృందావనం
కుంటివాని నడిపించే బృందావనం
గుడ్డివాడు చూడగలుగు బృందావనం
మూఢునికి జ్ఞానమొసగు బృందావనం
మూగవాని పలికించే బృందావనం
మూఢునికి జ్ఞానమొసగు బృందావనం
మూగవాని పలికించే బృందావనం
అందరినీ ఆదరించు సన్నిధానం
అభయమిచ్చి దీవించే సన్నిధానం
సన్నిధానం దేవుని సన్నిధానం సన్నిధానం
రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా
దీనులకు కాపాడ రారా కృష్ణయ్యా
కృష్ణయ్యా కృష్ణయ్యా కృష్ణయ్యా కృష్ణయ్యా
చరణం3:
కరుణించే చూపులతో కాంచవయ్యా
శరణొసగే కరములతో కావవయ్యా
కరుణించే చూపులతో కాంచవయ్యా
శరణొసగే కరములతో కావవయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా
కన్న తల్లి స్వర్గంలో మురిసేనయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా
కన్న తల్లి స్వర్గంలో మురిసేనయ్యా
నిన్ను చూచి బాధలన్ని మరిచేనయ్యా
ఆధారము నీవేరా రారా కృష్ణా
నిన్ను చూచి బాధలన్ని మరిచేనయ్యా
ఆధారము నీవేరా రారా కృష్ణా
కృష్ణా కృష్ణా రారా కృష్ణా
రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా
దీనులకు కాపాడ రారా కృష్ణయ్యా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment