తారాగణం: నరేష్,సితార,రావుగోపాలరావు
గాత్రం: చిత్ర
సంగీతం: కీరవాణి
నిర్మాత: రామోజీరావు
దర్శకత్వం: మౌళి
సంస్థ: ఉషాకిరణ్ మూవీస్
విడుదల: 1990
పల్లవి:
మధుమాసం కుహుగానం
మధుమాసం కుహుగానం
ఇది రాయని ఇతిహాసమే
విధిరాతతో పరిహాసమే
మన జీవన లీలలో ఊయల
మధుమాసం కుహుగానం
చరణం1:
ఆ చిలకజతలే కలా ఇలా కవ్వించగా
నీ కిలకిలలిలా ఎద ఎద స్పందించగా
కథకాని జీవితాలే కనిపించే రూపము
శిధిలాలలోన నేడు కనిపించే దీపము
మదిలోని జ్వాల జ్యోతులైన వేళ
మధుమాసం కుహుగానం
చరణం2:
నా వలపు జతిలో శృతి లయ పసిపాపలు
ఈ సుఖఋతువులో ఇవే కదా సుమమాలలు
ఇది చూపువెంట వెలిగే ఒక కరుణానందము
ప్రతిపూట చేయు పనిలో ఒక ధర్మావేశము
ఋణ పాశమేదొ బంధమైన వేళ
మధుమసం కుహుగానం
ఇది రాయని ఇతిహాసమే
విధిరాతతో పరిహాసమే
మన జీవన లీలలో ఊయల
మధుమాసం కుహుగానం
లలలాల లలలాల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment