Mar 28, 2011

త్రిశూలం

గాత్రం: బాలు,సుశీల
సాహిత్యం: ఆత్రేయ





పల్లవి:

పెళ్ళంటే ?
పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు
మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు అ అ అ ఆ
పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు
మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు
పెళ్ళైతే ?
పెళ్ళైతే ముంగిళ్ళు లోగిళ్ళు ముగ్గులు ముత్తైదు భాగ్యాలు
ముద్దు ముచ్చట్లు మురిసే లోగుట్లు చెలిమి సంకెళ్ళు వెయ్యేళ్ళు అ అ అ ఆ
పెళ్ళైతే ముంగిళ్ళు లోగిళ్ళు ముగ్గులు ముత్తైదు భాగ్యాలు ఉం ఉం ఉం ఉం

చరణం1:

గోదారి ఒడ్డున గోగుల్లు పూచిన వెన్నెలలో
కొసరాడు కోర్కెలు చెరలాడు కన్నుల సైగలలో
ఆ ఆ ఆ ఆ గోదారి ఒడ్డున గోగుల్లు పూచిన వెన్నెలలో
కొసరాడు కోర్కెలు చెరలాడు కన్నుల సైగలలో
మమతానురాగాలు మరుమల్లెలల్లిన పానుపులో ఓ ఓ
హృదయాలు పెదవుల్లో ఎరుపెక్కు ఏకాంతవేళల్లో
వలపు పులకింతలో వయసు గిలిగింతలో
వింతైన సొగసుల వేడుకలో

అ అ అ ఆ పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు
మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు
అ అ అ ఆ పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు ఆ ఆ ఆ ఆ

చరణం2:

కలలన్ని కలబోసి వెలసిన ఈ పంచవటిలో
ఇల్లాలు నేనై ఇలవేల్పు నీవైన కోవెలలో
ఆ ఆ ఆ కలలన్ని కలబోసి వెలసిన ఈ పంచవటిలో
ఇల్లాలు నేనై ఇలవేల్పు నీవైన కోవెలలో
సిరిమువ్వ రవళుల మరిపించు నీ నవ్వు సవ్వడిలో ఓ ఓ ఓ
కులమన్నదే లేని అలనాటి వేదాల ఒరవడిలో
సామ గానాలము సరస రాగాలము
ప్రేమికులన్న కులమున్న లోకంలో

అ అ అ ఆ పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు
మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు
అ అ అ ఆ పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: