గాత్రం: ఘంటసాల, జానకి(తొలి పాట)
సాహిత్యం: ఆరుద్ర
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాత & దర్శకత్వం: కె.బి.తిలక్
విడుదల: 1957
పల్లవి:
నీ ఆశ అడియాస
చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమవాస
లంబాడోళ్ళ రాందాసా
నీ ఆశ అడియాస
చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమవాస
లంబాడోళ్ళ రాందాసా
చరణం1:
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
తలచినది ఒకటైతే జరిగినది వేరొకటి
తలచినది ఒకటైతే జరిగినది వేరొకటి
చితికినది నీ మనసు అతుకుటకూ లేరెవరూ
నీ ఆశ అడియాస
చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమవాస
లంబాడోళ్ళ రాందాసా
చరణం2:
గుండెలలో గునపాలు గుచ్చారే నీవాళ్ళు
గుండెలలో గునపాలు గుచ్చారే నీవాళ్ళు
కన్నులలో గోదారి కాలువలే కట్టింది
నీ ఆశ అడియాస
చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమవాస
లంబాడోళ్ళ రాందాసా
బ్రతుకంతా అమవాస
లంబాడోళ్ళ రాందాసా
|
No comments:
Post a Comment